కర్నూలు మహి న్యూస్ మార్చి 03:
రిటైర్డ్ అవుతున్నందుకు బాధ లేదు గాని ఒక పెద్ద బ్రాండ్ విజయ మిల్క్ కేంద్రం నుంచి బయటకు వస్తున్నందుకు బాధగా ఉందని కర్నూలు మిల్క్ యూనియన్ అధికారి డిప్యూటీ డైరెక్టర్ డి.ఎం.వలి పేర్కొన్నారు. కర్నూలు పట్టణంలోని విజయ పాల డైరీ పరిపాలన భవనంలో మేనేజర్ వివేకానంద సమక్షంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డిఎం వలి ను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మేనేజర్ మాట్లాడుతూ డిఎం వలి చేసిన సేవలను కొనియాడారు.

క్రమశిక్షణతో, స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారన్నారు. ఈ కార్యక్రమంలో వలి సతీమణి ఖుర్షీద్, ఏజెంట్లు రవీంద్ర, సుంకన్న, వెంకటస్వామి, శ్రీను, సిబ్బంది నరసింహారెడ్డి, అనంత్, రంగారావు, శేఖర్, శోభ, స్వాతి, రాజేష్, రాజు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


1 Comment
Excellent Vali Sir
” Vijaya Milk..its Brand “