Author: admin

యానాం, మహి న్యూస్,ఏప్రిల్ 6. గతంలో 2016లో ఎన్నార్ పార్టీ అభ్యర్థిగా తిరుకోటి భైరవ స్వామి పోటీ చేసినప్పుడు, ప్రత్యర్థి మల్లాడి ఎన్ ఆర్ పార్టీ అభ్యర్థి పై విజయం సాధించాడు. 2021లొ ఎన్ ఆర్ పార్టీ అధ్యక్షుడు రాజకీయ దురంధరుడు ఓటమి ఎరుగని ధీరుడు రంగస్వామి మల్లాడి మద్దతుతో యానంలొ పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థి రాజకీయ ఓనమాలు తెలియని గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ రంగస్వామి పై విజయం సాధించాడు. ఈ విజయంతో మల్లాడి, రంగస్వామి ఖంగు తిన్నారు.మల్లాడి చేసిన గత ఆరాచక పరిపాలనకు చమర గీతం పలికారుయానం ప్రజలు. జాతీయస్థాయి మీడియాలో ఈ విజయం పై చర్చ జరిగి రంగస్వామి రాజకీయ అవమనాల పాలయ్యాడు, ఈ విజయంతో అశోక్ పై కక్ష పెంచుకున్నాడు రంగస్వామి. మల్లాడికి ఢిల్లీ ప్రతినిధి (నామినేట్) పదవినిచ్చి రాజకీయంగా ప్రజాప్రతినిధిని గత నాలుగున్నర సం లుగా ప్రత్యక్షంగా అడ్డుకున్నాడు, పరోక్షంగా యానం అభివృద్ధికి మోకాలొ…

Read More

యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6. యానాంలో రేపటితో ముగియనున్నడంతో NR కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు కు మద్దతుగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు… మల్లాడి కి మద్దతుగా ఒక వీరా అభిమాని తన ఇంటి వద్ద మోదీ,రంగస్వామి మల్లాడి ఫొటోస్ తో NR MALLAADI డిజిటల్ బోర్డు ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం, పూజలు చేస్తూ అభిమానాని చాటుకుంటున్నాడు… మరొకరు పడవ పై మల్లాడి, జగ్గు గుర్తు ప్లెక్సీలు పెట్టి డిజే సౌండ్ తో గోదావరి లో ప్రచారం చేస్తూ వినూత్నం గా మద్దత్తు తెలుపుతున్నాడు… కోలనీలలో మహిళలు ఒక చోటకు చేరి మల్లాడి ఫ్లెక్సీ కి పాలాభిషేకం,పూలు జల్లుతూ జగ్గు గుర్తుకే మన ఓటు అంటూ నినాదలు చేస్తూ మల్లాడి కి మద్దతుగా నిలుస్తున్నారు…

Read More

యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6. యానాం పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణపరిధిలో మెట్టకూరు రమాభాయినగర్కు చెందిన దడాల యశోధరరావు (44) బైక్ పై ద్రాక్షారామ దారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, వద్దకు వచ్చేసరికి వెనుకనుంచి వచ్చిన రామచంద్రపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఆయన ముందు భాగం ఢీకొందని దీంతో ఆయన కిందిపడి పోవడంతో బస్సు చక్రాలు ఆయన మీదనుంచి వెళ్లడంతో యశోధరరావు అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. మృతినికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం యానాం జిజిహెచ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై తిరువక్కనరుసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read More

యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6. యానాం నియోజకవర్గంను సుమారు రూ.2,700 కోట్లతో అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నానని ఎన్ఆర్కాంగ్రెస్అభ్యర్ధి మల్లాడి కృష్ణారావు పేర్కోన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తట్టన్చావిడి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సిఎం రంగసామి ఇటీవలి కేంద్రప్రభుత్వాన్ని కోరిన మీదట ఐటి పరిశ్రమకు రూ. 1250 కోట్లు మంజూరు చేసిందని దానిలో సైతం యానాం వాటాగా పంపిణీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు. భారతప్రభుత్వం ద్వారా సైతం నిధులు తీసుకువస్తానని ఇచ్చిన మాటను ప్రతీదానిని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజలకోరిన మీదటే తాను మళ్లీ శాసనసభ్యుడిగా పోటీచేస్తున్నానని అన్నారు. గత అయిదేళ్ల అశోక్ పాలనను ప్రజలు చూసారని ఆయనను అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. అనేక సంఘాలతో తాను ఉంటానని దీంతో తనకు వారంతా మద్దతుగా వస్తున్నారన్నారు. ఈనెల 7న నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. 12గంటలకు తన సృగృహంనుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు అధికసంఖ్యలో…

Read More

యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6 : యానాంలోనే జీవనం సాగిస్తూ సొంత ఇల్లులేని పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేలా తాను గెలిచినవెంటనే ఇళ్లపట్టాల పంపిణీ చేపడతానని ఆవిధంగా ఇప్పటికే 10 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు ఆవిధంగా తన సొంతఖర్చులతో ఇళ్లపట్టాల పంపిణీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ పేర్కొన్నారు. సోమవారం అంబేడ్కర్నగర్, గణపతినగర్ తదితర ప్రాంతాల్లో ఆయన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందలాది కుటుంబాలు జీవనోపాధి కోసం యానాంలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్నారని అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఇళ్లపట్టాలు ఇవ్వకపోవడంతో పలు కుటుంబాలు ఇరుకుగదుల్లోను, అద్దె ఇండ్లలోను జీవిస్తున్నా రన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను ఇప్పటికే పలువురినుంచి ఇండ్ల పట్టాల పంపిణీకి విజ్ఞాపన పత్రాలను తీసుకున్నానన్నారు. వాటిని స్క్రూటినీ చేసి తన సొంత బర్చులతో భూమిని కొనుగోలుచేసి ఇళ్లపట్టాలుగా…

Read More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, మహి న్యూస్, మార్చ్ 10 : ఆంధ్రప్రదేశ్‌లో గతంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయించిన రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం ఇతర వర్గాలకు ఇవ్వబడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ యువనాయకులు బొక్కా ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం అమలుకావాలంటే బీసీ వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.*బీసీ సామాజిక వర్గాల అభివృద్ధిలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ స్థానం ప్రత్యేకమని ఆయన అన్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, బీసీ రక్షణ చట్టం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని కొనియాడారు.గతంలో బీసీలకు కేటాయించిన రాజ్యసభ స్థానాలను మళ్లీ అదే వర్గాలకు కేటాయించడం ద్వారా వారి రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం కొనసాగించాలని ఆయన కోరారు. కూటమి పొత్తు కారణంగా కొంతమంది…

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏపీ మహిళా సమాఖ్య నగర సమితి ల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ ముందు పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా చేపట్టడం జరిగిందన్నారు.ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులుగా మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సమైక్య నగర కార్యదర్శి భారతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలు వాడుతున్న 14 కేజీల సిలిండర్ పైన 60 రూపాయలు హోటల్స్ వ్యాపారస్తులు వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన 160 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గమని తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని లేదా పెరిగిన గ్యాస్ ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వారి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఉదయం లేచినప్పటి…

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10: కర్నూలు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిలు షాబీర్ భాష, శ్రీనివాసులు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు స్థానిక సిఆర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో షాబీర్ భాష, శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు ఒక కాలేజీకి అనుమతి తీసుకొని రెండు మూడు కాలేజీలు నిర్వహిస్తున్నారని దీనిపైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో ఇదే అదునుగా మేనేజ్మెంట్ పెట్టరేగిపోతుందని ఇలాంటి వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో అదే అదునుగా తీసుకొని మేనేజ్మెంట్, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అలాట్మెంట్ కార్డు తీసుకొని కళాశాలకు వెళ్తే ఫీజు మొత్తం చెల్లిస్తేనే సీటు కేటాయిస్తామని మేనేజ్మెంట్ చెప్తా ఉందని దీనివల్ల…

Read More

వైయస్సార్ కడప, మహి న్యూస్, మార్చి 10 : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశము యొక్క ప్రత్యేకత అని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు… జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ డా.నిధి మీనా అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట సబ్ కలెక్టర్ భావన,జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, బద్వేలు, పులివెందుల ఆర్ డి ఓ లు చంద్రమోహన్,చిన్నయ్య, కడప మున్సిపల్ కమీషనర్ రాకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ… మత సంప్రదాయాలను గౌరవిస్తూ.. శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో.. భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా.. జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని తెలిపారు. శాంతియుత,ఆనంద వాతావరణంలో, ఒకరి మతాచారాలను…

Read More

రైల్వేకోడూరు/పుల్లంపేట. మహిన్యూస్. మార్చి:10 రైల్వేకోడూరు నియోజకవర్గంపుల్లంపేటల్లో విభిన్న ప్రతిభావంతులకు ఈనెల 14వ తేదీ శనివారం రైల్వేకోడూరు,చిట్వేలి పాఠశాలల యందు సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ వారి సౌజన్యముతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో ద్వారా విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా సహాయ సంచాలకుల వారు నిర్వహించబోయే కృత్రిమ సహాయ పరికరాల కార్యక్రమం నిర్వహించబడుతోందని పుల్లంపేట మండల అభివృద్ధి అధికారి జై శ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుల్లంపేట, ఓబుళవారిపల్లి, రైల్వేకోడూరు మండలాలకు చెందిన వారికి రైల్వేకోడూరుకు చెందినహేన్రీ మేయర్ మెమోరియల్ స్కూల్ (హె. ఎం. ఎం. హై స్కూల్ ఎంపీడీవో కార్యాలయం దగ్గర, పెనగలూరు చిట్వేల మండలాల కు చెందిన వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ నందు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులు మీకు…

Read More