Author: editor

అమరావతి, మహి న్యూస్ మార్చి 11: రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం జగన్‌కు అలవాటైపోయిందని ఆయన ఓ ప్ర‌క‌ట‌న‌లో ఘాటుగా విమర్శించారు. గత ఐదేళ్లలో రైతు భరోసా పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్, తన పాలనలోనే రైతులకు ఇవ్వాల్సిన అనేక చెల్లింపులను నిలిపివేసిన విషయం ప్రజలు మరిచిపోలేదని మంత్రి అన్నారు. ఇప్పుడు అదే విషయంపై నైతిక హక్కు ఉన్నట్లు మాట్లాడటం జగన్ రాజకీయ కపటత్వానికి నిదర్శనమన్నారు. రైతులకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో రైతు భరోసా పేరుతో రాష్ట్రం రూ.13,500 ఇస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్రం నుంచి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి, కేంద్రం…

Read More

అమరావతి, మహి న్యూస్ మార్చి 11: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధ‌వారం విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆక్వాక‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఆథారిటీ (APSADA) కో-వైస్ ఛైర్మన్, నాన్-ఆఫీషియల్ కమిటీ సభ్యులు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా లో వచ్చిన వార్తలు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మధ్యప్రాచ్య (గల్ఫ్) ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు. సముద్ర ఆహార…

Read More

తెలంగాణ మహి న్యూస్ మార్చి 11 శీర్షిక: ప్రకృతి గర్భగుడిమన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళవర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణై పలికిన వేళపక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గదైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగాచంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.కానీ —మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లుఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళహృదయ పవిత్రత బూడిదగా మారింది.అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడుఆత్మదీపం మసకబారింది.ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలోజీవన వనమే వాడిపోయింది.అడవులను నరికిన కత్తుల ధ్వనిమనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మన హృదయం మళ్లీ పవిత్రమైతేనేప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితేఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.– ప్రకృతిని కాపాడాలని కోరుతూ శ్రీమతి మంజుల పత్తిపాటి…

Read More

.చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం మార్చ్ 9.చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో ఉన్న పురోహితులు పంచాంగ కర్త డాక్టర్ పాణ్యం శ్రీనివాస్ శర్మ రచించిన 2026-27 వ నూతన పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగమును సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారి చేతుల మీదుగా పంచాంగం ఆవిష్కరణ జరిగింది. అఖిలభారత పురోహితులు సంఘ అధ్యక్షులు పాణ్యం శ్రీనివాస శర్మ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ను గురజాల జగన్మోహన్ ను దుస్సాలవాలతో సత్కరించిన అనంతరం ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగడం సంతోషంగా ఉందని పాణ్యం శ్రీనివాస్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస…

Read More

కర్నూలు సిటీలోని విజయపురి కాలనీలో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం బయటపడుతోంది. కాలువ మధ్యలోనే విద్యుత్ స్తంభాన్ని వదిలి పనులు చేపట్టడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఆటంకం కలగడమే కాకుండా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Read More

అమరావతి మహి న్యూస్ మార్చి 08 మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కవయిత్రి మంజుల పత్తిపాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడారు. ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, ప్రతి మహిళ నిజంగా సంతోషంగా ఈ రోజును జరుపుకుంటుందా అనే విషయంపై మనస్ఫూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సమాజంలో చాలా సందర్భాల్లో మహిళకు మహిళే శత్రువుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురైన కష్టాల బాధను మరో సాటి మహిళపై చూపించే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. సంతోషంగా ఇంటికి అడుగుపెట్టిన మహాలక్ష్మిని వరకట్న దాహంతో బాధపెట్టే మహిళలు కూడా సమాజంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ఉన్నా కూడా కట్టెల పొయ్యిపై వంట చేసిన మహిళలు ఉన్నారని, అత్తలు, ఆడపడుచుల కాళ్లు పట్టి వారు పడుకున్న తర్వాతే నిద్రపోయే…

Read More

అమ‌రావ‌తి, మహి న్యూస్ మార్చి 5: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం,అర‌కులో కాఫీ తోట‌ల న‌ష్టంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసన మండలిలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశార‌ని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందచేశామ‌ని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీపై ప్రభుత్వం…

Read More

కర్నూలు మహి న్యూస్ మార్చి 04 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరిస్తామని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరారు ఓల్డ్ సిటీ భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు ఎలక్ట్రికల్ కార్పెంటర్ గౌండ పెయింటర్స్ కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాంద్ బాషా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ భవన నిర్మాణ కార్మికులు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాజాపాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పడం ప్రభుత్వాలకు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మారిందని ఇచ్చిన మాట తప్పడం చేసిన వాగ్దానాన్ని మర్చిపోవడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ…

Read More

కృష్ణాజిల్లా మహి న్యూస్ మార్చి 04 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల విద్యాసంస్థలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈరోజు స్థానిక మచిలీపట్నంలోని నిర్మల హైస్కూల్ నందు నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి. నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ , నిర్మల హైస్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు వారి యొక్క ఆత్మ రక్షణ, భద్రత, ప్రమాదం సంభవించే సమయంలో తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి, పట్టుదల ఏకాగ్రత తో ఎలా ముందుకు సాగాలి, వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మరి ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించి చిన్నచిన్న టెక్నిక్స్ తో తమను…

Read More

Press Release అమ‌రావ‌తి, మహి న్యూస్ మార్చి 04: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రీయ వ్య‌వ‌సాయం, కౌలు రైతుల రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ, 2025–26 క్రాప్ ఇయర్‌కు రాష్ట్రంలో వ‌రి సాగు చేస్తున్న రైతులు మొత్తం 38.97 లక్షల మంది ఉన్నార‌ని, అందులో ఖరీఫ్ 26.94 లక్షలు, రబీ 12.03 లక్షల మంది ఉన్నార‌ని వెల్లడించారు. అధిక వరి సాగు ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక మార్గదర్శకాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2025–26…

Read More