యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6.
యానాం నియోజకవర్గంను సుమారు రూ.2,700 కోట్లతో అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నానని ఎన్ఆర్కాంగ్రెస్అభ్యర్ధి మల్లాడి కృష్ణారావు పేర్కోన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తట్టన్చావిడి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సిఎం రంగసామి ఇటీవలి కేంద్రప్రభుత్వాన్ని కోరిన మీదట ఐటి పరిశ్రమకు రూ. 1250 కోట్లు మంజూరు చేసిందని దానిలో సైతం యానాం వాటాగా పంపిణీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు. భారతప్రభుత్వం ద్వారా సైతం నిధులు తీసుకువస్తానని ఇచ్చిన మాటను ప్రతీదానిని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజలకోరిన మీదటే తాను మళ్లీ శాసనసభ్యుడిగా పోటీచేస్తున్నానని అన్నారు. గత అయిదేళ్ల అశోక్ పాలనను ప్రజలు చూసారని ఆయనను అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు.

అనేక సంఘాలతో తాను ఉంటానని దీంతో తనకు వారంతా మద్దతుగా వస్తున్నారన్నారు. ఈనెల 7న నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. 12గంటలకు తన సృగృహంనుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు అధికసంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు రావాలనికోరారు.

