యానాం, మహి న్యూస్,ఏప్రిల్ 6.
గతంలో 2016లో ఎన్నార్ పార్టీ అభ్యర్థిగా తిరుకోటి భైరవ స్వామి పోటీ చేసినప్పుడు, ప్రత్యర్థి మల్లాడి ఎన్ ఆర్ పార్టీ అభ్యర్థి పై విజయం సాధించాడు.
2021లొ ఎన్ ఆర్ పార్టీ అధ్యక్షుడు రాజకీయ దురంధరుడు ఓటమి ఎరుగని ధీరుడు రంగస్వామి మల్లాడి మద్దతుతో యానంలొ పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థి రాజకీయ ఓనమాలు తెలియని గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ రంగస్వామి పై విజయం సాధించాడు. ఈ విజయంతో మల్లాడి, రంగస్వామి ఖంగు తిన్నారు.
మల్లాడి చేసిన గత ఆరాచక పరిపాలనకు చమర గీతం పలికారు
యానం ప్రజలు. జాతీయస్థాయి మీడియాలో ఈ విజయం పై చర్చ జరిగి రంగస్వామి రాజకీయ అవమనాల పాలయ్యాడు, ఈ విజయంతో అశోక్ పై కక్ష పెంచుకున్నాడు రంగస్వామి.
మల్లాడికి ఢిల్లీ ప్రతినిధి (నామినేట్) పదవినిచ్చి రాజకీయంగా ప్రజాప్రతినిధిని గత నాలుగున్నర సం లుగా ప్రత్యక్షంగా అడ్డుకున్నాడు, పరోక్షంగా యానం అభివృద్ధికి మోకాలొ డ్డాడు, అశోక్ పై తన రాజకీయ కక్ష తీర్చుకున్నాడు రంగస్వామి.
అశోక్ యానం ప్రజల సమస్యల కొరకు చేసిన ఆమరణ నిరాహార దీక్ష, శాసనసభ ఆవరణలో చేసిన నిరసన దీక్షలు ఈ విషయాలన్నీ యానం ప్రజలు గమనిస్తున్నారు.
2026 ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి, ఎన్ ఆర్ పార్టీ అభ్యర్థిగా రంగస్వామి మద్దతుతో బరిలో దిగాడు మల్లాడి, జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోకు, పుదుచ్చేరి, యానం కాంగ్రెస్ అధ్యక్షుల వారి బృందం సమన్వయ సహకారంతోను, ఎంపీ వైద్య లింగం సలహాతో మల్లాడిని ఓడించడానికి యానంలో కాంగ్రెస్ ప్రభంజనానికి కదంతొక్కుచున్నాడు మన అశోకుడు.
ఇటు యానంలోనూ అటు పుదుచ్చేరిలోనూ “తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన” మల్లాడి, రంగస్వామి ఓటమికి యానం ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తుంది. ముచ్చటగా మూడోసారి ఓటమి అంచున ఎన్ఆర్ పార్టీ అభ్యర్థి మల్లాడి.
కావున యానాం ఓటర్లు తమ అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి అశోక్ ను గెలిపించి యానం అభివృద్ధికి పాటుపడదాం! మన వంతు కృషి చేద్దాం! పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేద్దాం!
యానం ఓటరులారా!
మీ ఓటు బిజెపి, ఎన్ ఆర్ పార్టీ కా! జాతీయ కాంగ్రెస్ కా!!
ప్రజలారా! కులకట్లు, మతం మత్తు వదులుదాం! బానిసత్వాన్ని వీడి స్వతంత్రులుగా జీవిద్దాం!
స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వంతో కలసి మెలసి కొనసాగుదాం!
జై గొల్లపల్లి.. జై జై కాంగ్రెస్ పార్టీ!

