యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6.
యానాం పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణపరిధిలో మెట్టకూరు రమాభాయినగర్కు చెందిన దడాల యశోధరరావు (44) బైక్ పై ద్రాక్షారామ దారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, వద్దకు వచ్చేసరికి వెనుకనుంచి వచ్చిన రామచంద్రపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఆయన ముందు భాగం ఢీకొందని దీంతో ఆయన కిందిపడి పోవడంతో బస్సు చక్రాలు ఆయన మీదనుంచి వెళ్లడంతో యశోధరరావు అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. మృతినికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం యానాం జిజిహెచ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై తిరువక్కనరుసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

