కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ డిసెంబర్ 13: *. రాయలసీమ ప్రాంతానికి తలమానికగా బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ నిలుస్తుందని, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.శనివారం కర్నూల్ నగరంలోని బుధవార పేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి కర్నూల్ నగరానికి వైద్య చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. అందుకు కర్నూల్ ను మెడికల్ సిటీగా రూపొందించాలని ఆయన కోరారు.కర్నూల్ లో బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ డాక్టర్ చంద్రశేఖర్ ఫ్యామిలీ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు.అల్లావుద్దీన్ అద్భుతదీపంలా ఈ హాస్పిటల్ లో ప్రారంభించడం గర్వకారణమన్నారు.అనుభవజ్ఞులైన అన్ని రంగాల డాక్టర్లతో వైద్య సదుపాయాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో నెలకొల్పడం గర్వించదగ్గ విషయమన్నారు. 1992 సంవత్సరంలో గౌరీ గోపాల్ హాస్పిటల్ టీజీ వెంకటేష్ ప్రారంభించడం జరిగిందన్నారు.1997లో ఐసీయూ సౌకర్యాలు లేకపోవడం జరిగిందన్నారు.కే ఈ కృష్ణమూర్తి అప్పటి ఎంపీగా ఉన్నారని, 2001 లో ఎమ్మెల్యేగా టీజీ వెంకటేష్ ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించి హార్ట్ అండ్ బ్రెయిన్ ఏర్పాటుచేసి ప్రజలకు వైద్య సదుపాయం కల్పించామన్నారు.రాయలసీమలోని ప్రజలు బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ లో ప్రత్యేకంగా ఉపయోగించుకుంటారని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ డబ్ల్యూ సీతారాం, డాక్టర్ గోవిందరెడ్డి,డాక్టర్ శ్రీకాంత్, వెంకట్ రమణ, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.



