కోనసీమ లో నాయకత్వం లోపం
అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఇంచార్జ్ లు కరువు!
ఓట్లు ఉన్నాయ్… నాయకులే లేరు!
ముమ్మిడివరం (మహి న్యూస్) డిసెంబరు 31
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో 21 స్థానాల్లో విజయం దక్కించుకున్న దరిమిలా..
ఈ ఏడాది ఏవిధంగా పార్టీ అభివృధ్ధికి.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్లాన్ చేశారు? అనే విషయాలు ఆసక్తి కర చర్చ ప్రజల్లో ఉంది. ఈ విషయాలపై మనసులో మాట స్పెషల్ ఫోకస్….
గత ఐదేళ్ల జనసేన పార్టీ గ్రాఫ్‌తో పోల్చుకుంటే.. 2025లో మాత్రం బలమైన పునాదులే పడ్డాయని చెప్పాలి. పార్టీ పరంగానే కాకుండా.. పార్టీ అధినేత పరంగా కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా 2025లో జనసేన ఎదిగింది.
వైసీపీ, టీడీపీ, బీజేపీలకు దూరంగా ఉండేవారు.. జనసేన వైపు చూశారు. తద్వారా చాలా మంది నాయకులు జనసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీ ప్రభావం గతంతో పోల్చితే పెరిగింది. అయితే.. నగరాలు పట్టణాల పరంగా మాత్రం ఇంకా.. ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.
ఉదాహరణకు కొత్తపేట,రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలలో జనసేనకు ఉన్న కార్యకర్తలు నాయకులు,.. ముమ్మిడివరం అమలాపురం వంటి ప్రధాన రాజకీయ ప్రభావం చూపించే నియోజకవర్గాలలో లేక పోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లోనూ నాయకత్వాన్ని పెంచుకునే దిశగా అడుగులు వెయ్యాలి
ఎస్సీ,ఎస్టీ లలో పెరుగుతున్న గ్రాఫ్:
ఎస్టీ, ఎస్సీలకు పార్టీ మరింత చేరువ కావడం. ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.. పార్టీ పరంగా అందిస్తున్న చేయూతవంటివి ఆయా సామాజిక వర్గాల ప్రజల్లో జనసేనపై గ్రాఫ్‌ను పెంచుతున్నాయి. ఇది పార్టీకి కలిసి వస్తున్న ప్రధాన అంశం.
నిన్న మొన్నటి వరకు వైసీపీకి మాత్రమే అనుకూలంగా ఉన్న రంపచోడవరం, పాడేరు, అరకు.. వంటి గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు, నగరాలువంటి చోట్ల ఇప్పుడు జనసేన కార్యకర్తలు పెరుగుతున్నారు. ఇది పార్టీకి 2026సంవత్సరాల్లో ఓటు బ్యాంకు రాజకీయాల పరంగా చూస్తే.. మేలు జరుగుతుందన్న వాదన ఉంది.
జనసేన ఇంచార్జ్ లు ఏరి:
జనసేన పార్టీ కి సామాజిక పరంగాను, పవన్ కళ్యాణ్ అభిమానులు పరంగా కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల అత్యంత బలమైనవి జనసేన కి. అమలాపురం లో 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ శెట్టిబత్తుల రాజబాబు నియోజకవర్గం ఇంచార్జ్ గా వ్యవహారించారు. అనివార్య కారణాలతో పార్టీ నుండి వైసీపీ పార్టీ లోకి వెళ్లారు. అప్పటి నుండి జనసేన పార్టీ కి శాశ్వత ఇంచార్జ్ ఎవరూ లేరు. అలానే ముమ్మిడివరం లో 2019 లో పితాని బాలకృష్ణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి సుమారుగా 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. 2024 లో కూటమి గా ఏర్పడడం తో ముమ్మిడివరం అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా టీడీపీ కి ఇవ్వడం తో బాలకృష్ణ వైసీపీ పార్టీ లో జాయిన్ అవ్వడం తో ముమ్మిడివరం లో జనసేన కి ఇంచార్జ్ లేకుండా పోయారు. అమలాపురం, ముమ్మిడివరం జనసేన పార్టీ కి బలమైన నియోజకవర్గాలు. అలాంటి నియోజకవర్గాలపై జనసేనాని ఎందుకు శాశ్వత ఇంచార్జ్ లను నియమించలేకపోతున్నారో జన సైనికులకు అంతు పట్టని విషయం.
పార్టీ ని బలోపేతం చెయ్యాలి:
పార్టీలో సంస్థాగతంగా ఉన్న లోపాలను సరిచేసేందుకు ఈ ఏడాది లో బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని డెవలప్ చేసేందుకు కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వీరిలోనూ మహిళలకు ప్రాధాన్యం పెంచడం ద్వారా.. 2026లో జనసేన గ్రామాలకు.. పట్టణాలకు విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.
అయితే.. వీటిని ఈ ఏడాది సమర్థవంతంగా ఇంప్లిమెంటు చేయడం ద్వారా.. ప్రత్యామ్నాయ పార్టీ నుంచి ప్రత్యామ్నాయ శక్తిగా కూడా పార్టీని డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుందని పార్టీ అధినేత, కార్యకర్తలు పెట్టుకుంటున్నారు. మొత్తంగా బలమైన ప్రణాళికకు 2026లో జనసేన పునాదులు వేసుకుంటుంది

