చిత్తూరు జిల్లా/ కాణిపాకం డిసెంబర్ 31.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం ఐరాల మండలం కాణిపాకం లో నూతన సంవత్సరం2026 జనవరి 1న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఇబ్బందుల్లేని, సంతృప్తికర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రసాద వితరణ, లడ్డు కౌంటర్లు, ఆన్‌లైన్ టికెట్ కౌంటర్లను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు శీతల పానీయాలు అందించడంతో పాటు, చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే మరింత సులభమైన దర్శనం లభిస్తుందని సూచించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థాన చైర్మన్ మణి నాయుడు, బోర్డు సభ్యులు, అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్.

