అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
ముమ్మిడివరం (మహి న్యూస్) డిసెంబరు 31
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ సందర్భంగా యువత క్రీడల పై మొగ్గు చూపి వ్యసనాలకు దూరంగా ఉండాలని ముమ్మిడివరం సిఐ ఎం.మోహన్ కుమార్, ఎస్. ఐ డి.జ్వాలాసాగర్ లు పేర్కొన్నారు. ముమ్మిడివరం పురవీధులలో బుధవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

