ద్రాక్షారామం(మహి న్యూస్) డిసెంబర్ 31:
ద్రాక్షరామం గుడిలో శివలింగాన్ని ధ్వంసం చేసిన శీలం శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ బుధవారం అతని ఇంటి వద్ద ద్రాక్షారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది శ్రీనివాస్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మోటర్ బైక్ నేరమునకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం రెమండపం పంపించడం జరిగిందన్నారు.
శ్రీనివాస్ద్రాక్షారామ గ్రామంలో గల లిటిల్ రోజ్ కాలేజీ నందు డిగ్రీ (B.Com) వరకు చదువుకుని, ప్రస్తుతం ఇనుప సామానుల పని చేసుకుంటూ జీవిస్తున్నట్లు, అతనికి శివుని పై విపరీతమైన భక్తి ఉండుట వలన తన కుడి భుజం వద్ద శివలింగంను పచ్చ బొట్టుగాను, తన యొక్క జన్మ నక్షత్రం ప్రకారంగా విష్ణు అనే పేరును తెలుగులోను, ఓం నమో వాసుదేవాయ భగవతే అనేవి హిందీలోను పచ్చ బొట్టుగా వేయించుకున్నాడు. తోటపేటలోని తన ఇంటిలో గల మంచి నీటి నుయ్యి, తన ఇంటి వైపుగా వెలుతున్న పంట కాలువ వలన పాడు అయిపోగా, దానిపై అతను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, ఎటువంటి న్యాయం జరగకపోవడం వలన కోపంతో నుయ్యిని కప్పి పెట్టి, దాని స్థానంలో కొట్టుబోరు కొట్టించినాడు. అలాగే గతంలో తన ఇంటిపొలానికి సంబందించిన కేసు విషయమై రామచంద్రపురంలో ఒక లాయర్ ని కలిసి సమస్య చెప్పి, అతనికి మూడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వగా, ఆ లాయర్ డబ్బులు తీసుకొని కేసు పరిష్కారం చేయకపోవటం వలన సదరు లాయరు పై కోపంతో అతని ఇంటి మెట్లను, గోడను సుత్తితో కొట్టి పాడుచేసినట్లు శ్రీనివాస్ తెలిపినట్లు ఎస్పీ వివరించారు. ఆ తరువాత కలగండ సూరిబాబు అనే పంతులు హోమం జరిపించి రోడ్డు త్రవ్వి, పైపులు పెట్టి కాలువ వేయగా, అటు వైపు గల డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అంతా తన ఇంటి ముందర నుండి వెళ్ళడంతో సదరు కాలువను పాడుచేసి కలగండ సూరిబాబుకి మరియు శ్రీనివాస్ కి మధ్య గొడవలు జరుగగా, ఆ తరువాత పనిలో భాగంగా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి గుడి ఆవరణలో గల కోనేరు వద్ద గల ఒక శివలింగానికి సదరు కలగండ సూరిబాబు పంతులు పూజ చేయడం చూసినాడు. సదరు కలగండ సూరిబాబు పంతులను ఎవ్వరు పూజలకు పిలవకూడదని, అతనికి ఎలాగైనా నష్టం కలిగించాలనే దురుద్దేశ్యంతో సదరు శీలం శ్రీనివాస్ 30-12-2025 వ తేదిన అర్ద రాత్రి దాటిన తరువాత సదరు శీలం శ్రీనివాస్ ఒక్కడే తన తెల్లటి హోండా యాక్టివా మోటార్ సైకిల్ పై సుత్తి తీసుకొని వెళ్లి, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి గుడి ఆవరణలో గల కోనేరు మెట్ల వద్ద ఉన్న శివ లింగంను సుత్తితో కొట్టి ద్వంసం చేసి వెంటనే అక్కడ నుండి తన మోటార్ సైకిల్ పై పారిపోవటం జరిగిందని ఎస్పీ తెలిపారు.

ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్-డివిజనల్ పోలీస్ అధికారి రఘువీర్ ఆధ్వర్యం లో 5 టీమ్ లతో 50 CC కామెరాలను క్షుణ్ణంగా పరిశీలించి ముద్దాయిని పట్టుకున్న రామచంద్రపురం CI M. వెంకట నారాయణ , ద్రాక్షారామ SI M. లక్ష్మణ్ రామచంద్రపురం SI S. నాగేశ్వరరావు పామర్రు SI G. సోమేంద్ర లను, రామచంద్రపురం సర్కిల్ క్రైమ్ సిబ్బందిని SP అబినందించినారు.

