రాజోలు, మహి న్యూస్, డిసెంబర్ 31:
మలికిపురం మండలం, శంకరగుప్తం డ్రెయిన్ పూడిక తీత మరియు గట్ల నిర్మాణం పనులను మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ వర్చువల్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్ గుప్తం చుట్టుపక్కల కొబ్బరి రైతులకు ఈ పనులతో ముంపు నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఉపముఖ్యమంత్రి చొరవతో త్వరితగతిన డ్రేయిన్ పూడికతీత పనులకు అవకాశం కలిగిందని కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కోనసీమ రైతులకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు ముందు ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్మహేష్ కుమార్,జాయింట్ కలెక్టర్ ,డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, జిల్లా అధికారులు, శంకరగుప్తం గ్రామ సర్పంచ్ రాపాక ఆనంద్ కుమార్, మలికిపురం మండలం ఎంపీపీ నాగమణి, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

