రాజోలు,మహి న్యూస్, డిసెంబర్ 31 :
పెనియల్ ప్రేయర్ హౌస్ చర్చి నందు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, పాస్టర్ శరత్ భూషణం స్వయంగా సమకూర్చిన కుట్టు మిషన్లు, బట్టలను కొంతమంది నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. జీవనోపాధి కల్పించే ఈ సేవా కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ తో కలిసి టిడిపి నాయకురాలు గొల్లపూడి అమూల్య హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో అయ్యాజీ వేమ, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, గుబ్బల శ్రీనివాస్, కడలి శ్రీ దుర్గ, సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, గుండెబోగుల బాబి,సూరిశెట్టి, స్వామి నాయుడు, వై కె రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సేవా భావనతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికీ అమూల్య హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మన రాజోలు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు జరగటం సంతోషకరమని అన్నారు. సహాయం అందించిన పాస్టర్ నాగభూషణంను ప్రశంసించారు.

