మహి న్యూస్ చీరాల జనవరి 3.
పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన పట్టాభి రాజేష్ కుమార్తె పట్టాభి సంయుక్త స్కూలుకి వెళ్లకుండా పారిపోయి ఎటు వెళ్లాలో తెలియని గందరగోళ స్థితిలో వేటపాలెం కు చెందిన కార్పెంటర్ ఎన్.భగవాన్ రెడ్డికి నిస్సహాయ స్థితిలో కనిపించింది. తప్పిపోయిన బాలికను ఇంటికి చేర్చడానికి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా బాలిక సరైన సమాధానాలు చెప్పకపోవడంతో చీరాల ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగింది. బాలిక తప్పిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాప తల్లిదండ్రులు సమాచారం తెలుసుకొని చీరాల వన్ టౌన్ సిఐ ఎస్ సుబ్బారావుని సంప్రదించగా విచారించిన అనంతరం పాప తండ్రిని గుర్తించి పట్టాభి సంయుక్తను అతనికి అప్పగించడం జరిగింది.

