చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం జనవరి 27.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సుమారు వందమందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య శాఖ అధికారి డాక్టర్ శిరీష, హెడ్ నర్స్ సుమతి బాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లంబర్ & ఎలక్ట్రిషన్ వారు మాట్లాడుతూ, థామస్ అల్వా ఎడిషన్ బల్బ్ కనిపెట్టిన రోజును మేము ఎలెక్ట్రిషియన్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా నాలుగువేల మంది ఎలక్ట్రిషన్లు ఉన్నామని మా ఎలెక్ట్రిషియన్ ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు.అలాగే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సర్వీసు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. గతం నుండి 100 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎలక్ట్రిషియన్ సభ్యులు తెలియజేశారు. తమకు మండలంలో ఒక భవనానికి స్థలం కేటాయించాలని గతంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసినట్లు తెలియజేశారు. ఈ విషయాలపై తమకు న్యాయం చేయాలని వారు మీడియా ముందు విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ వి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు అన్సర్ భాష, అధ్యక్షులు జె మొగిలీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు హేమశేఖర రెడ్డి, కార్యదర్శి గణపతి, ఉప కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి వంశీ, కమిటీ మెంబర్లు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

