నంద్యాల జిల్లా/ నంద్యాల మహి న్యూస్ జనవరి 27 భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాదం తిరుపతి గారు హాజరు అయ్యారు రాష్ట్ర కమిటీ సమావేశం స్థానిక సునీత వొకేషనల్ కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం *వికసిత భారత్ శిక్షా అధిష్టాన్* చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఆయన అన్నారు దేశంలో వైద్య, న్యాయవిద్య మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే కుట్ర చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీనివలన విద్య అనేక మందికి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు దేశ ప్రజానీకం కలిసికట్టుగా వ్యతిరేకించాలని కోరారు. ఈ అధిష్టాన్ విధానం వల్ల ఇతర సంస్థల పేర్లను రద్దుచేసి విద్యను ఒక వర్గం చెందిన రాజకీయ దృక్పథాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న పేర్ల మార్పు పై శ్రద్ధ పెట్టకుండా ఉన్నత విద్యాభివృద్ధి కోసం నాణ్యమైన విద్య ప్రమాణాలతో కూడిన విద్య అందించడం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు తగిన బడ్జెట్ కేటాయించని కేంద్ర ప్రభుత్వం పేర్ల మార్పుతో ఏం సాధిస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు విద్యారంగా అభివృద్ధి కోసం భవిష్యత్తులో దేశ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం తక్షణమే సంక్షేమ హాస్టల్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లను మంజూరు చేయాలని కోరారు అనేక సంక్షేమ హాస్టళ్లకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాంటి సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు అదేవిధంగా మార్కుల కోసం ర్యాంకుల కోసం విద్యార్థులను వేధించే విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను సమయ పాలన లేకుండా వేధించే విద్యాసంస్థలపై విచార జరపాలని కోరారు ఈ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సందెపోగు ఉదయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్యన్ సందీప్ రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్,కిషోర్, అభి తదితరులు పాల్గొన్నారు

