- కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్ల ప్రశంసలు
- జిల్లాలోని కడప, సి.కె.దిన్నె జెడ్పీ హైస్కూళ్లలో నిర్వహణలో ఉన్న స్మార్ట్ కిచెన్ షెడ్ల పరిశీలన
కడప, మహి న్యూస్ జనవరి 29 :

సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉంది. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆలోచన ప్రశంసనీయం, దేశానికే ఆదర్శనీయం అని.. కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డా. వి. వినోద్ కుమార్ లు అభినదించారు.
రాష్ట్రానికే ఆదర్శవంతంగా జిల్లాలో అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురువారం జిల్లాకు వచ్చిన కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డా. వి. వినోద్ కుమార్ లు.. స్థానిక కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
** సమావేశంలో వారు మాట్లాడుతూ.. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉందని, జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి ఆలోచన ప్రశంసనీయం, దేశానికే ఆదర్శనీయంగా స్మార్ట్ కిచన్ వ్యవస్థను నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలియజేస్తూ.. చక్కటి టీమ్ వర్కుతో ముందుకు వెళుతున్న జిల్లా అధికారులను ప్రశంసించారు.
** ఈ సందర్భంగా.. ఎడిపి, స్మార్ట్ కిచెన్ల నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, స్మార్ట్ కిచేన్ల నిర్వహణను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కృష్ణా, బాపట్ల జిల్లా కలెక్టర్లకు క్షుణ్ణంగా వివరించారు. 2024లో కడప నగరపాలక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీట్ కు హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. శుచికరమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే ఆలోచనతో పాఠశాలకు తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారని… అదే స్పూర్తితో జిల్లా కలెక్టర్. డా. శ్రీధర్ చెరుకూరి గారి నూతన ఆలోచనలతో జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు.

ఫైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ప్రస్తుతం సికే దిన్నె 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ల ద్వారా డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 132 పాఠశాలలకు చెందిన 10,512 మంది విద్యార్థులకు 13 ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్ తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్ లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటు నీటినే వంటకు ఉపయోగించడం జరుగుతోందన్నారు.
త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రానున్నాయనని వివరించారు. గతంలో సాధారణ వంట నిర్వాహకుల ద్వారా వంట వండడం, ప్రస్తుతం స్మార్ట్ కిచన్ల ద్వారా వంట తయారీకి గల వ్యత్యాసాలను, విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి అందుతున్న అశేష ఆదరణ వంటి వివరాలను తెలియజేశారు.
స్మార్ట్ కిచెన్ షెడ్ల పరిశీలన…
** అంతకు మునుపు గురువారం ఉదయం ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల అభివృద్ధిలో భాగంగా.. జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనతో పైలెట్ ప్రాజెక్టుగా అమలులోకి తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్వహణ తీరును కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డా. వి. వినోద్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించారు. వంటకు సంబంధించిన అన్ని ప్రక్రియలను, సరుకుల నాణ్యత, భోజనం తయారీ విధానాన్ని, ఆర్ఓ ప్లాంటు, ఆహార పంపిణీ వాహనాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.

వంట నిర్వాహకులను ఆయన పలకరించగా.. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం శుచి, రుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించగలుగుతున్నామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సులభంగా.. వంటను పూర్తి చేయగలుగుతున్నామని వంట సిబ్బంది తెలపడంతో… జిల్లాలో స్మార్ట్ కిచన్ల ద్వారా సమర్థవంతంగా అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం తీరుపై ఆనందం వ్యక్తం చేశారు. స్మార్ట్ కిచెన్ పనితీరు అబ్దుతంగా ఉందని, రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శంగా స్మార్ట్ కిచెన్ షెడ్లను రూపొంచించారని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని వారు అభినందించారు. వారి జిల్లాల్లో కూడా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమంలో కెఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డఓ జాన్ ఇర్విన్, డీఈవో శంశుద్దిన్, డిఆర్డీఏ ఎపిడి ప్రసాద్, సంబందిత శాఖల అధికారులు, ఎస్ఎస్ఏ ఇంజినీరింగ్ అధికారులు, ఎడిపి యంగ్ ప్రొఫెషనల్స్ శ్రీకాంత్, జ్యోతిక, అమర మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

