కడప జిల్లా/జమ్మలమడుగు, మహి న్యూస్, జనవరి 30 :
2018- 19 లో ఎస్సి కార్పొరేషన్ ద్వారా వాహనాలు తీసుకున్న లబ్ధిదారులు ఎస్సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జి. రాజ్యలక్ష్మీ ని కలిసి ఉపాధి మార్గం చూపించాలని శుక్రవారం ఉదయం కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ 2018-19 గత టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నందు ఎన్.ఎస్.ఎఫ్.డి సి లో ఇన్నోవా క్రిష్ట కార్లు మాకు మంజూరు అయ్యాయి అన్నారు. 2019 లో ప్రభుత్వం మారడం మమ్మల్ని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నందు లబ్ధిదారులైన మమ్ములను టిడిపి కి అనుకూలమైన లబ్ధిదారులుగా గుర్తించి మాకు ప్రభుత్వ కార్యాలయాలు,ఇతర ప్రభుత్వ అనుసంధారేతర ప్రైవేట్ కంపెనీ లలో నెలసరి బాడిగల కు ఏర్పాటు చేకూర్చకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బహిరంగ టాక్సీ స్టాండ్ లలో రోజువారి బాడిగలు లేకపోవడంతో మా జీవనోపాధికి చాలా దుర్భర పరిస్థితిలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సంవత్సరానికి 1 సారి ఇన్సూరెన్స్ 40 వేలు, 3 నెలలకు ఒకసారి రోడ్డు టాక్స్ సుమారు 6 వేలు,1 నెలకు కారు కంతు 22 వేలు, ఇతర కారు ఫిట్నెస్ 10 వేలు మెయింటినెన్స్ లతో తీవ్ర ఆర్థిక భారమయ్యాయన్నారు. 2024 తర్వాత ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీలో స్త్రీ శక్తి పథకం తో మహిళలకు ఉచిత ప్రయాణంతో అరకొరగా ఉన్న రోజువారి బాడిగలు సైతం మాకు లేకపోవడం వలన మా కుటుంబ జీవనోపాధి మనుగడ కోసం గతంలో తమ టిడిపి ప్రభుత్వం మంజూరు చేసిన మా వాహనాలు [కార్లు] పూర్తిగా ఇంటి కే పరిమితం కావడంతో మా బ్రతుకులు కష్ట కాలంలో ఉన్నాయన్నారు. మా కుటుంబ పోషణలు తీవ్ర భారంగా మారడం వలన దయచేసి మా కుటుంబాల పరిస్థితులు మెరుగుపడేందుకు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఏదైనా గుర్తింపు పొందిన సంస్థల కంపెనీలలో నెలసరి బాడిగల కు ఏర్పాటుచేసి మా జీవితాలకు వెలుగులు నింపే దారి చూపాలని కోరారు. కార్యక్రమంలో కన్నెలూరు మల్లికార్జున, సాంబాబు, ఓబులేసు లు కలరు.

