ఒంటి కొండ వద్ద స్కూల్ బస్సు బోల్తా అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా?
మహి న్యూస్ .కే.పల్లి శ్రీ సత్య సాయి జిల్లా జనవరి 31: శ్రీ సత్య సాయి జిల్లాలో మరో మారు విద్యాసంస్థల బస్సుల భద్రత ప్రశ్నార్థకమైంది. శనివారం ఉదయం సికేపల్లి మండలం ఒంటికొండ సమీపంలో ధర్మవరం లో నిర్వహిస్తున్న వంశీకృష్ణ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సు బోల్తా పడటం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తు విద్యార్థులు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఈ ప్రమాదం రవాణా శాఖ పనితీరుపై అనేక విమర్శలకు దారితీస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్. ఐ సత్యనారాయణ హుటాహుటి న ప్రమాద స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నారు. పలువురు గ్రామస్తులు మరొక విద్యా సంస్థ అయినా కృషి విద్యాలయ బస్సు కూడా అతివేగంతో వెళుతుందని వేగాన్ని కట్టడి చేయాలని పోలీసులకు తెలిపారు

