నంద్యాల మహి న్యూస్ ఫిబ్రవరి 15:-
అబాకస్ మరియు వేదిక్ మ్యాధ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సత్యసాయి విద్యార్థి సత్యసాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు విశ్వం ఎడ్యుటేక్ ఆధ్వర్యంలో శనివారం రోజున విజయవాడలోని మన కళ్యాణ వేదికలో నిర్వహించినటువంటి అబాకస్ మరియు వేదిక్ మ్యాధ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో వేదిక్ మ్యాధ్ వాల్యూమ్ – 1 విభాగం నందు ఎస్ కార్తీక్ అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది వేదిక్ మ్యాధ్ వాల్యూమ్ – 2 విభాగంలో కే లక్ష్మీ ప్రణీత స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అబాకస్ సీనియర్ లెవెల్ – 1 విభాగంలో సి ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి స్టేట్ 4 ర్యాంక్ సాధించడం జరిగింది అబాకస్ సీనియర్ లెవెల్ – 1 విభాగంలో విజువైలేజేషన్ విభాగం నందు ఎస్ సమీర్ కన్సలేషన్ బహుమతి సాధించడం జరిగింది విద్యార్థులు సాధించినటువంటి ఈ ఘన విజయాలపై పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ మణికంఠ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు మరియు అందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయులను ఘనంగా అభినందించడం జరిగింది భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరడం జరిగింది

