చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం ఫిబ్రవరి 15.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కె.జి.సత్రం వద్ద చీకూరు పల్లి కొండపై వెలసిన శ్రీసిద్దేశ్వరస్వామి కొండకు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయానికి భక్తులు పోటెత్తారు.స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయం వద్ద భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సిద్దేశ్వర స్వామిని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు నియోజకవర్గం మురళీమోహన్, కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, మండల టిడిపి గౌరవాధ్యక్షులు ఎన్ పీ జయ ప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షులు ఎన్ పీ ధరణి ప్రసాద్, మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్, కోదండ యాదవ్, వల్లేరు కళ్యాణ్, మాధవ నాయుడు, మోహన్ నాయుడు,చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ఐరాల జడ్పిటిసి సుచిత్ర, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి చీకూరుపల్లి గ్రామస్తులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు స్థానిక టిడిపి జనసేన నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

