శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 15:
మాజీ సైనిక, కుటుంబ సభ్యులకు వ్యవసాయ డ్రోన్ల పై అవగాహన క్యాంపు నిర్వహించడం జరిగిందని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ అన్నారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శైలజ ఆధ్వర్యంలో కోరమండల్, దక్ష డ్రోన్స్ సహకారంతో పెద్దపాడులో ఒక ప్రైవేట్ హోటల్ వద్ద వ్యవసాయ డ్రోన్ల అవగాహన క్యాంపు మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారిరి శైలజ మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమంలో సుమారు 60 మంది పైగా మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారని అన్నారు. వ్యవసాయంలో రంగంలో డ్రోన్ల ప్రయోజనాలు, స్వయం ఉపాధి అవకాశాలు, నెలవారీ ఆదాయ సామర్థ్యాలను శ్రీనివాస్ ప్రసాద్ , మోహన్ మాజీ సైనికులు వివరించారు. ఈ అవగాహనా కార్యక్రమంపై మాజీ సైనికుల నుంచి మంచి ఆసక్తి వ్యక్తమైందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ సిబ్బంది, కోరమండెల్, దక్ష డ్రోన్స్ తరుపున శ్రీనివాస ప్రసాద్ , మోహన్, ఆదిత్య, పృద్వి, తదితరులు పాల్గొన్నారు.

