చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 :
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసియుండు శ్రీ మొగిలీశ్వరస్వామి దేవస్థానమునకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం(పరాకామణి) బుధవారం చిత్తూరు దేవదాయశాఖ తనిఖిదారు యస్.శ్వేత పర్యవేక్షణలో, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త యమ్.బి.విజయకుమార్, కార్యనిర్వహణాధికారి ఎ.మునిరాజ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. 86 రోజులకు గాను దేవస్థానం హుండీలు ద్వారా రూ 7,96,688.00లు , అన్నదానము హుండీలు ద్వారా రూ 84,597.00 రావడం జరిగినది. భక్తులు హుండీలో సమర్పించిన బంగారం 18 గ్రాముల 20 మిల్లిగ్రాము, వెండి 92 గ్రాముల 400 మిల్లిగ్రాము వచ్చినది. ఈ కార్యక్రమంలో ఈవో మునిరాజులు, ఇన్చార్జి శరవణ, గ్రామస్తులు మంజునాథ్ నాయుడు,ప్రసాద్ నాయుడు , సోమశేఖర్ నాయుడు,బంగారుపాళ్యం హెడ్ కానిస్టేబుల్ వినాయకం, ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, బాలాజీ, పాల్గొనడం జరిగినది.

