విజయనగరం, మహి న్యూస్, ఫిబ్రవరి 25:
టిడ్కో ఇళ్లలబ్ధిదారులకు న్యాయం చెయ్యాలని బుధవారం బాలాజీ సెంటర్ లోని ప్రజా గ్రంధాలయంలో బాధితులు విలేకరుల ముందు తమ గోడు వెళ్ళబుచ్చారు.ఈ కార్యక్రమం లో ప్రజా విజయం పార్టీ అధ్యక్షులు పి. షణ్ముఖ రావు, టివి దుర్గారావు, లక్కవరపు కోట ఆదినారాయణ, సోమేశ్, ఇ.ఎస్.ఎన్ రాజు, జీ.సింహాచలం, ఎల్.లిపిక లు బాధితులకు అండగ నిలిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
విజయనగరం పట్టణంలో అద్దె ఇళ్లల్లో వున్న వారికి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు మంజూరు చేసిందని, కాని అక్కడ కనీస సౌకర్యాలు లేని కారణంగా ఆ ఇళ్లల్లో చేరడానికి ఇష్టపడడం లేదన్నారు. ప్రభుత్వం అక్కడ కనీస సౌకర్యాలైన తాగునీరు,రోడ్డు, మార్కెట్, విద్య, వైద్యం లాంటివి ఏర్పాటు చేయాలని కోరారు.అక్కడ సౌకర్యాలు లేని కారణంగా లబ్ధిదారులు ఇళ్లలో చేరడానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.అయితే బ్యాంకు వారు డబ్బులు కట్టని పక్షంలో ఈ నెల 27వ తేదిన వేలం వేస్తామని నోటీసులు పంపించారని, ఇదే విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారు.బ్యాంకు నోటీసులు అందుకున్న బాధితులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

