- జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
- అన్ని మండలాల రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అంశాలపై సదస్సు
కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 25 : రెవిన్యూ అధికారులు అన్నిరకాల జీవోలు, చట్టాలపై అవగాహన పెంచుకుని.. తమ పనితీరు మెరుగుపరచుకొని బాధ్యతాయుతంగా, జవాబుదారి తనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సభా భవన్ లో కడప, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వో, మండల సర్వేయర్ల తో వివిధ రకాల రెవెన్యూ అంశాలపై ఒకరోజు సదస్సు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యులుగా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… రెవిన్యూ సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్లగలిగినప్పుడే శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. ఏలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్‌ఎస్ ద్వారా అందిన దరఖాస్తులను ఆయా గ్రామాల వారిగా క్రోడీకరించుని నాణ్యమైన ప్రతిస్పందన, పరిష్కారాన్ని అందించాలన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించడమే మన బాధ్యత అని తెలియజేశారు.
భూ సమస్యల పరిష్కారంలో వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొని అర్జీలను నాణ్యతగా సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. భూముల అంశంలో నిబంధనలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఎంక్వయిరీలు నిర్వహించేటప్పుడు సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు, ఆర్ఓఆర్, పట్టాదారు పాస్ పుస్తకాలు, చట్టాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి పని చేయాలన్నారు.
అనంతరం అన్ని రెవెన్యూ అధికారులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అందులో భాగంగా పట్టాదార్ పాస్ బుక్ పంపిణీ, పునఃసర్వే, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, రెవెన్యూ క్లినిక్ ల నిర్వహణ, ఉత్పరివర్తనలు, గ్రామాల వారీగా రెవెన్యూ ఆడిట్, మ్యుటేషన్ సర్వీసెస్ ఆడిట్, జీరో ఖాతాలు, ల్యాండ్ అలియేషన్స్, భూసేకరణ మరియు జాతీయ రహదారి ప్రాజెక్టులు, E ఆఫీస్, ROR కేసులను తొలగింపు, నవీకరణ, ORCMS ఇతరాలు.. అలాగే అందరికీ గృహనిర్మాణం, వాచ్‌డాగ్, వాటర్ బాడీలు & ట్యాంక్ బెడ్‌లు, అటవీ వైవిధ్యీకరణ, 22A కేసులు, జనాభా లెక్కలు, కోర్టు కేసులు (OLCMS), గోల్డెన్ రికార్డ్స్, Suo-moto caste, AMS పెండింగ్ తదితర అన్ని రెవెన్యూ అంశాలపై జేసీ రెవెన్యూ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.
ఎలాంటి భూములను ఎవరికి అసైన్ చేయాలి అనే అంశానికి సంబంధించి విధివిధానాలపై, రీ సర్వే, వెబ్ లాండింగ్, మ్యుటేషన్స్ మొదలైన అంశాల్లో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు ఎదురయ్యే సమస్యలు, అనుభవాలపై సమీక్ష నిర్వహించి, ఆయా రెవెన్యూ డివిజన్ అధికారులకు, తహసీల్దార్లకు పునశ్చరణ అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సమావేశంలో ఎస్డీసిలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, శిరీష, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, ల్యాండ్స్ సర్వే ఎడి శాంత రాజ్, నాలుగు రెవిన్యూ డివిజన్ల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వో లు, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

