జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి..
వై ఎస్ ఆర్ కడప,మహి న్యూస్ ఫిబ్రవరి 25:
రెవెన్యూ సమస్యల పరిష్కారం పై అధికారులు మనసుపెట్టి పని చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
బుధవారం జిల్లా సచివాలయం లోని సభా భవాన్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా, డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడుతో కలసి రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప,జమ్మల మడుగు, బద్వేలు,పులివెందుల ఆర్ డి ఓ లు జాన్ ఎర్విన్,సాయి శ్రీ, చంద్రమోహన్,చిన్నయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి శాంతరాజ్, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో రెవిన్యూ సంబంధిత అంశాలైన 22 A,మ్యూటేషన్, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్, 22 రెవెన్యూ సంబంధిత అంశాలపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ ద్వారా పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

