మన అడవులను రక్షించుకుందాం – మన భవిష్యత్తును కాపాడుకుందాం.
చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 :
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం అడవి అగ్ని ప్రమాదాలు ప్రకృతి సంపదకు వన్యప్ లు మన జీవన వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించడం అతి అవసరం అడవుల సంరక్షణ సమాజం సమిష్టి బాధ్యత. అడవిలో మంటలు వెలిగించవద్దు అనుమతి లేకుండా ఎటువంటి మంటలు దహన చర్యలు చేపట్టకండి ఆర్పి వేయండి. చెత్తను సక్రమంగా నిర్వహించండి ప్లాస్టిక్ గాజు సీసాలు సిగరెట్ ముక్కలు వంటి పదార్థాలను అడవిలో వదిలి వేయవద్దు. పొగ లేదా మంట కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. అగ్ని సాంకేతకాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. వన్య ప్రాణులను కాపాడండి అడవి మంటల వల్ల పులులు ఏనుగులు ఇతర జంతువుల జీవితం ప్రమాదంలో పడుతుంది. అడవిలో అప్రమత్తంగా ఉండండి అడవుల్లోకి ప్రవేశించినప్పుడు భద్రత నియమాలను కచ్చితంగా పాటించండి. అడవులను పచ్చగా సురక్షితంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత. అటవీ అగ్ని నివారణ మనందరిదీ సంయుక్త బాధ్యత. ఈ కార్యక్రమంలో బుధవారం ఎం విగిరి బిట్ ఎఫ్బి ఓ,కే.మోహనమ్మ, ఎంవిగిరి బీట్ ఏబీవో కే.తరుణ్, మిట్టూరు బీట్ ఏ బి ఓ ఆర్ రెహమాన్, ఎఫ్ ఎస్ ఓ ఎం.వి. గిరి జి.మోహన్ మురళి తదితరులు బంగారుపాళ్యం మండల పరిధిలోని రాగిమాను పెంట, కీరమంద, టేకుమంద, గోవర్ధనగిరి, తదితర ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు.

