అంతర్ రాష్ట్ర సరిహద్దు కావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు ఐ.జి జివిజి అశోక్ కుమార్
ఐ. పోలవరం మండలం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 :
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం పోలీస్ స్టేషనులో ఏలూరు రేంజ్ ఐ.జి జివిజి అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఆయనకు పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఐ.జి మాట్లాడుతూ. ఇది అంతర్ రాష్ట్ర సరిహద్దులలో ఉన్న పోలీస్ స్టేషను, మనకు యానాం సరిహద్దులో ఉండటం వల్ల ఈ పోలీస్ స్టేషన్ ఇంపార్టెన్స్ మారింది. ఎందుకంటే స్మగ్లింగ్.. అక్కడ డ్యూటీ తక్కువ ఉండటం వల్ల లిక్కర్ గానీ, పెట్రోల్, డీజిల్ గానీ ఎక్కువ ఇటు పక్కకి స్మగ్లింగ్ అవ్వడం, అలాగే నేరస్థుల కదలికలు కూడా ఉండటం మా దృష్టికి వచ్చింది. వీటిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము, చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ కొన్ని యాక్టివ్ ఉన్నాయి. ఆ స్నాచింగ్ గ్యాంగ్స్‌ను కూడా త్వరగా వెరిఫై చేసి వారిని కూడా పట్టుకుంటాము. మరొక ముఖ్య సమస్య ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్స్. ఇది ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్‌కు దగ్గరగా ఉండటం, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండటం వల్ల రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని మీద కూడా మేము ప్రత్యేక ప్రణాళిక చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్స్ అన్నీ వెరిఫై చేసి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ మేము తయారు చేశాము. అంటే తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. ఈ ఐ. పోలవరం లిమిట్స్‌లో రెండు బ్లాక్ స్పాట్స్.. ఒకటి పాత ఇంజరం ఎదుర్లంక బ్రిడ్జి దగ్గర ఒకటి, తర్వాత కొమరగిరి. ఈ రెండు స్పాట్స్‌లో మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.
ఈ కొమరగిరి స్పాట్‌లో గత మూడు సంవత్సరాలలో ఎనిమిది మంది చనిపోవడం జరిగింది. తర్వాత ఈ పాత ఇంజరం ఎదుర్లంక బ్రిడ్జి దగ్గర దాదాపు 16 మంది చనిపోయారు గత మూడు సంవత్సరాలలో. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ డెత్స్, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మీద జిల్లాలో అన్నీ తయారు చేశారు ఎస్పీ తయారుచేసారు. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అన్నీ మెజర్స్ తీసుకొని ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తాము. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ మిస్సింగ్ కేసులు. గోదావరి నదికి దగ్గరగా ఉండటం వల్ల సూసైడ్‌లు కూడా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ గోదావరిలో దూకడం జరుగుతోంది. దాని మీద కూడా ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసాము. సీసీ కెమెరాస్ చూస్తే దాదాపు 52 వరకు సీసీ కెమెరాస్ పెట్టారు. బ్రిడ్జి మీద కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. తర్వాత లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేశామని చెప్పారు. ఎవరైనా సస్పీషియస్‌గా తిరుగుతున్నా బ్రిడ్జి మీద, ఇటువంటి అటెంప్ట్ చేస్తే పెట్రోలింగ్ టీమ్స్ వెళ్లి వాళ్ళని ఆపి సూసైడ్ చేసుకోకుండా నిరోధించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని పోస్టర్స్ సూసైడ్ చేసుకోకూడదని కొన్ని అడ్వైజరీ పోస్టర్స్ కూడా ఈ బ్రిడ్జి మీద కొన్ని చోట్ల డిస్ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. అన్ని విధాలుగా ఇది చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్.

ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు, ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి భవిష్యత్తులో ఇక్కడ క్రైమ్ తగ్గేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాము. తర్వాత రెండు మూడు పోక్సో కేసులు కూడా ఇక్కడ రిపోర్ట్ అయ్యాయి. చిన్న పిల్లల మీద నేరాలు.. ఒక స్కూల్ టీచర్ ఒకతను, ఇంకొకతను ప్రైవేట్ ఉద్యోగం టీచర్‌గా చేస్తూ విద్యా వాలంటీర్‌గా వచ్చి అతను కూడా ఒక పాప మీద అతను ఈ పోక్సో కేసు ఒకటి చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు జరగకుండా అవేర్నెస్ చేస్తున్నాము. ఇటువంటి కేసులలో నిందితులు ఆ పిల్లల యొక్క ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, అక్కడ తల్లులు వాళ్ళ తండ్రులు ఎవరూ లేకపోవడం, పేదరికాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు ఇటువంటి పనులు చేశారు. ఇటువంటి వాళ్ళ మీద కేసులు అన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేశాము. ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ముమ్మరంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పిల్లలకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.జి వెంట జిల్లా ఎస్.పి రాహుల్ మీనా, అమలాపురం డి.ఎస్.పి టి.ఎస్.ఆర్.కె ప్రసాద్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పుల్లారావు, ముమ్మిడివరం సి.ఐ మోహన్ కుమార్, స్దానిక ఎస్.ఐ రవీంద్ర బాబు, పోలీసు స్టేషను సిబ్బంది పాల్గొన్నారు.
