యానం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 :
కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అందించిన వందల కోట్ల నిధులతో నిర్మించిన జిప్మ్ ర్ బ్రాంచ్ ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యానం పరిసర ప్రాంత ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా వినియోగించుకోవచ్చని బుధవారం ఉదయం జరిగిన సమావేశంలో మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక జిప్మెర్ ఆస్పత్రిలో మరిన్ని ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో అందిస్తున్న అన్ని రకాల సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ప్రతి ఇన్ పేషెంట్ ని పలకరించి వారికి అందిస్తున్న వైద్య సేవలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి వారు ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు అనంతరం డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లు అందరికీ అందుబాటులో లేని మందలను ఆయన కొని అందించారు. అదేవిధంగా వైద్యులకు రోగులకు స్వీట్లు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో యానం జిప్మ్ ర్ ఆసుపత్రిలో ఎమ్మారై, సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాలు 2018 -19 సంవత్సరాలలో అనేక నిధులు అందించారు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అదేవిధంగా ఇటీవల యానం జిప్మ ర్ ఇన్చార్జ్ ఆనందబాబుని తీసుకుని వెళ్లి అనేక మెరుగైన వైద్య సేవలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేయడంతో తక్షణమే అనుమతులు జారీ చేశారన్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ ఆస్పత్రి మెడికల్ కాలేజి ఫారామెడికల్ కోర్సులకు సంబంధించి గిరియంపేటలో నిర్మించిన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభించనున్నట్లు మల్లాడి కృష్ణారావు తెలిపారు. వెటర్నరీ ఆసుపత్రి ప్రాంగణంలో జిప్మర్ వైద్యులకు వైద్య సిబ్బందికి వందలాది కోట్ల రూపాయలతో క్వార్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.డాక్టర్లు తమ అదృష్టంగా భావించి వైద్య సిబ్బంది రోగులకు సేవలందించడం అదృష్టంగా భావించాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యలు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

