చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 26 :
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని నేషనల్ హైవే పక్కన ఉన్న డాబాలలో సీఐ కత్తి శ్రీనివాసులు వారి సిబ్బందితో గురువారం తనిఖీ చేయడం జరిగింది. డాబాలలో లిక్కర్ వంటి మత్తు పదార్థాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా నిర్వహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని డాబా యజమానులకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు తెలియజేశారు. డాబాల దగ్గర యజమానులు సీసీ కెమెరాలు అమర్చాలని తెలియజేశారు. ఎటువంటి గొడవలు డాబాల దగ్గర జరిగిన గొడవలు పడిన వారిపై, డాబా యజమానులపై కేసులు తప్పకుండా ఉంటాయని సీఐ హెచ్చరించారు.

కార్యక్రమంలో సిఐ తో పాటు కానిస్టేబుల్స్ అస్గర్, ధరణి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

