కర్నూలు, మహి న్యూస్, ఫిబ్రవరి 26:
కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని పాత ఈద్గా వద్ద హ్యాపీ మొబైల్స్ రెండో బ్రాంచ్ ని నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా షో రూమ్ వద్ద నుండి బయలుదేరిన హ్యాపీ మొబైల్స్ ప్రచార బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ రాజవిహార్ మీదుగా పాత బస్టాండ్ కొండారెడ్డి బురుజు నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా షోరూం మేనేజర్ శ్రీకాంత్, రామకృష్ణ మాట్లాడుతూ నేటి తరానికి, యువత కు మెచ్చే అద్భుత మయిన ఫీచర్లుగల మొబైల్స్ అందుబాటు ధర లో ఉన్నాయని, క్రెడిట్ కార్డులు, మరియు ఈఎంఐ ఫెసిలిటీ తోపాటు ,తగ్గింపు ధరలతో, మొబైల్ పై గిఫ్ట్ లతో అనేక సదుపాయాలు ఉన్నాయని వినియోగదారులు వినియోగించుకోవలసిందిగా వివరించారు. ముఖ్యంగా హ్యాపీ మొబైల్స్ లో మొబైల్ అమ్మకాలతో పాటు గృహ ఉపకరణాల ను కూడా అతి తక్కువ ధరలో అందిస్తున్నామని, సోలార్ పవర్ ను ప్రభుత్వ సబ్సిడీతో తమ వద్ద అందజేసే సౌకర్యం కూడా ఉందని వాళ్లు తెలిపారు.

