- ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన శాసన సభ్యులు దేవ వరప్రసాద్
రాజోలు, మహి న్యూస్, ఫిబ్రవరి 26:
మలికిపురం గ్రామంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద, లక్కవరం గ్రామంలో లక్కవరం సెంటర్ నందు, రాజోలు గ్రామంలో సంత మార్కెట్ వలువలమ్మ గుడి వద్ద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఉద్యమిని పార్టీ భాగస్వామ్యం చేయడమే సాధాక్ లు ముందు ఉన్న బాధ్యత అని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారందరిని గుర్తించి వారికి సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు.నియోజవర్గ వ్యాప్తంగా సాధక్ లు అందరికి సభ్యత్వ నమోదు లింక్ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి గతానికి మించి సభ్యత్వ నమోదు చేసి నియోజకవర్గాన్ని ముందు స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.

జనసేన నాయకత్వం అంతా సాధక్ లకు అండగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

