అమలాపురం, మహి న్యూస్, ఫిబ్రవరి 26:
అమరావతి నుండి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ భాషా లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 ఏళ్లు నుండి 59 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు చదవడం, రాయడం, లెక్కలు నేర్పించడం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
మహిళలు, గ్రామీణ ప్రజలు, వెనుకబడిన వర్గాలకు డిజిటల్ అక్షరాస్యత కల్పిస్తున్నారు.జిల్లాలో 5,340 మంది వాలంటీర్లు 53,092 మంది వయోజనులకు ఆన్‌లైన్ ద్వారా బోధన చేస్తున్నారు.సామాజిక అవగాహన, ఆరోగ్యం, ఆర్థిక సాక్షరత పెంపొందించడంపై దృష్టి పెట్టాం అన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు.సులభమైన పాఠ్యపుస్తకాలు, ప్రాథమిక గణితం, దైనందిన జీవితానికి ఉపయోగపడే విషయాల బోధన.
బ్యాంకింగ్, డిజిటల్ సేవలు వినియోగించే సామర్థ్యం పెంపు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.2029 నాటికి రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత రాష్ట్రంగా మార్చడం అనే లక్ష్యంతో
ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్. ఎల్.ఎన్.ఏ.టీ) ప్రీ పరీక్షలు ఫిబ్రవరి 28న నిర్వహణ..ఫైనల్ పరీక్షలు మార్చి 15న నిర్వహణ పై అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

