అమలాపురం, మహి న్యూస్, ఫిబ్రవరి 26:
ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-20 పోటీలలో రెండు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించిన కారుమూరి లేఖా నీహారికను జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అభినందించారు.
న్యూఢిల్లీలోని కే.డీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-20 పోటీలలో రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నీహారిక ,
లైట్ కాంటాక్ట్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించింది. క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో ఒక రజత పతకాన్ని కైవసం చేసుకుంది.ఈ విజయంతో కోనసీమ జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటింది.బెంగళూరులో నిర్వహించనున్న కేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా లేఖా నీహారిక జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయమని భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.

