బద్వేల్/కడప, మహి న్యూస్, పిబ్రవరి 26 :
నిహాల్ సోలార్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న, మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్. టీడీపీ నాయకులు బిజివేముల రామిరెడ్డి ఆహ్వానం మేరకు బద్వేల్ మునిసిపాలిటీ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ప్రారింభించిన నిహాల్ సోలార్ ఎంటర్ప్రైజెస్ ను మైదుకూరు ఎమ్మెల్యే పట్టా సుధాకర్ యాదవ్ బద్వేల్ టిడిపి ఇన్చార్జి రితేష్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, బి. మఠం టిడీపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ యల్లటూరి సాంబశివరెడ్డి, మిల్లు శీను, వైట్ సుబ్బారెడ్డి, వేల్పుల భాస్కర్ యాదవ్, పూజ శివ యాదవ్, సుధాకర్, గంగరాజు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


