గోకులం షెడ్లతో రైతులకు ప్రయోజనం – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
సిద్ధవటం/కడప, మహిన్యూస్, పిబ్రవరి 26:
సిద్ధవటం మండలం నియోజకవర్గ పార్టీ కార్యాలయం రాజంపేట పట్టణం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల,పశువుల అభివృద్ధి కోసం చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.
గురువారం నాడు సిద్ధవటం మండలం, మూలపల్లె గ్రామం నందు పర్యటిస్తూ నూతనంగా నిర్మించిన నాలుగు గోకులం షెడ్లను అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం,పాడి పశువుల అభివృద్ధి కోసం రాయితీ కింద గోకులం షెడ్లను,పశుగ్రాసాన్ని కూడా అందిస్తుందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చమర్తి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట
రాష్ట్ర డైరెక్టర్,డాక్టర్ నాగూరి వీరభద్రుడు,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,రాజశేఖర్,సింగల్ విండో అధ్యక్షులు,దారపునేని దశరథ రామానాయుడు,నిత్య పూజ స్వామి దేవస్థానం చైర్మన్,జంగిటి రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర,ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి,టిడిపి పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగ మునిరెడ్డి,మాజీ జడ్పిటిసి చలమయ్య యాదవ్,సింగల్ విండో డైరెక్టర్,బాల్రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు,జవహర్ భాష,మల్లు సంజీవరెడ్డి,మాజీ మండల కన్వీనర్,మామిడి సుబ్బారెడ్డి,నియోజవర్గ బీసీ నాయకులు,కాడే చెంచయ్య నాయుడు,మండల క్లస్టర్ ఇంచార్జ్,దారపునేని రాజా నాయుడు,మల్లు వెంకటసుబ్బారెడ్డి,సర్పంచి ప్రతినిధి ఓబులయ్య,వెంకటేష్, భాస్కర్ రెడ్డి,మండల కో కస్టర్,శంకర్ రెడ్డి,గాలి సుబ్బయ్య యాదవ్,నియోజవర్గ మహిళా లీడర్ కోటపాటి సుబ్బమ్మ,సుబ్బారెడ్డి,నాగభూషణం నాయుడు,హరి,మామిడి రమణారెడ్డి,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

