విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం
సిడిపిఓ మద్దమ్మ
కర్నూలు, మహిన్యూస్, ఫిబ్రవరి 27:
కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాజెక్ట్ పరిధిలోని పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్లును వేధిస్తున్నట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఐ.సి.డి.యస్ సిడిపిఓ మద్ధమ్మ పేర్కొన్నారు.అంగన్వాడి టీచర్లను వేధిస్తున్న ఆస్పరి ఐసిడిఎస్ మద్దమ్మ అనే
శీర్షికతో ప్రచురితమైన వార్త అవాస్తమని పేర్కొన్నారు.ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని అంగన్ వాడి కేంద్రములు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.ఇటీవల ఒక అంగన్ వాడి టీచర్ తీవ్ర మానసిక వేదనతో అనారోగ్యం పాలైందని వార్త గురించి ఆమె మాట్లాడుతూ దేవనకొండ మండలం కప్పట్రాల్ల 2 టీచర్ యం.లక్ష్మీదేవి కప్పట్రాళ్ళ గ్రామములో నివసించడం లేదని ఎమ్మిగనూరు మండలం నందు నివసిస్తూ రోజు ఎమ్మిగనూరు నుండి కప్పట్రాల్ల గ్రామమునకు తిరుగుతూ విధులను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.సంబంధిత అంగన్వాడి టీచర్ విధుల పట్ల నిర్లక్ష్య వైకరితొ ఉన్నారని, విధులు సరిగ్గా నిర్వహించడం లేదని అనేక మార్లు మెమోలు ఇవ్వడం జరిగిందన్నారు. అయిన ఆమెలో ఎటువంటి మార్పులు రాలేదని అందుకు గాను షోకాజ్ నోటీస్ జారి చేసామని ఆ తర్వతా ఈ వార్తను ప్రచారం చెయ్యడం జరిగిందన్నారు.సంబంధిత టీచర్ ని తాను మానసికంగా వేధించలేదని కేవలం నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు.

