తాళ్ళరేవు, మహి న్యూస్,ఫిబ్రవరి 27 :
మండల పరిధిలోని పోలేకుర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విశేష పూజలు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. శనివారం ఉదయం నూతన విగ్రహం ధ్వజస్తంభం ప్రతిష్ట చేయనున్నారు. అనంతరం భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆయా కార్యక్రమాలను తిలకించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నారు.

