ఐ. పోలవరం,మహి న్యూస్, ఫిబ్రవరి 27.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల్లో తుంగలో తొక్కిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది నిర్వాకం….. కేవలం ఫోటోలు కే పరిమితమైన మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం…. డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఐ. పోలవరం ఎంపీడీవో కార్యాలయంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం కంటి తుడుపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్ చిత్రపు బాబి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ నివారణ , టెలి మానస్ 14416 సేవల ప్రాముఖ్యతను సమగ్రంగా వివరించలేకపోయారు. సమాజంలో బాల బాలికలపై జరిగే లైంగిక దాడులను ఎలా నివారించాలినే విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఐ పోలవరం మండల విద్యాశాఖ అధికారి వీధి సురేష్ బాబు, కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ బాబు మ్రొక్కుబడిగా హాజరయ్యారు. ఐసిడిఎస్ సూపర్వైజర్స్ బాల బాలికలపై జరిగే లైంగిక దాడులను అందరి సమిష్టి కృషితో నివారించవచ్చు అని చర్చించడం జరిగింది. పేరుకే మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం తప్ప ఈ కార్యక్రమంలోకీ వచ్చామా లేదా అనే పద్ధతిలోపాల్గొన్న ఎవరికి సరైన అవగాహన లేదు ఆలోచన అంతకంటే లేకపోయింది.

ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్, విద్య , ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , హెల్త్ డిపార్ట్మెంట్ ఏ. ఎన్. ఎంలు, ఆశ వర్కర్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు బీ.సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జ్యూడిషల్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు ప్రధానోపాధ్యాయులు టీచర్లు అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు తదితరులు నామకహ పాల్గొనడం జరిగింది.

