- నెలకు రూ.1.36 లక్షలు లీజు ఖరారు- మరో పాట వాయిదా
తాళ్లరేవు, మహి న్యూస్, ఫిబ్రవరి 27:
మండల పరిధిలోని కాపులపాలెంలో వేంచేసియున్న శ్రీ సీతారామస్వామివారి దేవస్థానానికి సంబంధించి యానాం కనకాలపేట గ్రామంలో ఉన్న భూములకు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ ఉపకమీషనర్ డీఎల్పీ రమేష్ బాబు పర్యవేక్షణలో ఈవో యర్రా వెంకటేశ్వరరావు వేలం పాట నిర్వహించారు. సర్వే నెంబరు 161లో ఉన్న రెండు ప్రతులకుగానూ సుమారు 3 ఎకరాల 72 సెంట్ల ఖాళీ భూమికి లైసెన్స్ హక్కునకు బహిరంగా వేలం పాట నిర్వహించగా తొలిప్రతి రెండు ఎకరాలకు గానూ నెలకు రూ.1.36 లక్షలు చెల్లించేందుకు భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు పాట దక్కించుకున్నారు.

సుమారు 10 మంది పాల్గొన్న ఈ వేలంపాటలో రెండవ హెచ్చు పాటదారులు మేడిద లక్ష్మీ మంగతాయారు రూ.1.35 లక్షల వరకు పాడారు. దీంతో హెచ్చు పాటదారుడు సాయిరాజుకు అధికారులు పాట ఖరారు చేసారు. కాగా రెండవ ప్రతి 1.72 ఎకరాలకు గానూ సరైన దర రాకపోవడంతో పాటను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ రమేష్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ దేవస్థానాలకు ఆదాయం పెంచే చర్యల్లో భాగంగా ఖాళీగా, బీడుగా ఉన్న భూములను 11 ఏళ్ల కాలానికి నెలవారీ అద్దె చెల్లించు పద్దతిన, అప్పగించిన తేదీనుంచి 11 ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ కమీషనర్ వారి ఉత్తర్వులకు లోబడి ఆ భూములను వినియోగించు కోవాలని తెలిపారు. దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే లైసెన్స్ రద్దు చేయడం జరుగు తుందన్నారు.

సీల్డ్ టెండర్, ఈ టెండర్లకు ఎటువంటి ధరఖాస్తులు రాలేదన్నారు. ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని, లైసెన్స్ దారులు తాత్కాలిక షెడ్లు మాత్రమే వేసుకోవాలని, నిర్ణీత గడువు అనంతరం యధావిదిగా అప్పగించాలన్నారు. ప్రతీ మూడేళ్లకు 30 శాతం అద్దెను పెంపుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో డీఈఓ కె. నాగేశ్వరరావు, ఇన్సెపెర్టర్ వి. ఫణీంద్ర కుమార్, ఈఓలు వీఆర్ చౌదరి. ఆర్.రాజేశ్వరరావు. పి.కృష్ణారెడ్డి, డి.శ్రీనివాసరావు, కెసీవీ వేణుగోపాల్, కె.సోమరాజు, జి. అశ్విని,, గ్రామస్థులు. తోట శ్రీను,కోన చిన్న సత్తియ్య, కాటంశెట్టి రామ్మూర్తి, మొపూరి నాయుడు, కోన సూరిబాబు,లంక బంగారం, కనకాల కృష్ణ, రాము రాజు, కోన ఆది బాబు, కనకాల వసంతరాయుడు, కోన మాజ్జి, పేరాబత్తుల నెయ్య,, తదితరులు పాల్గొన్నారు.

