తిరుమల, మహి న్యూస్ ఫిబ్రవరి 27:
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. .
ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నత అధికారులు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…

