- జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా
కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 27 :
పారిశ్రామిక వనరులు పుష్కలంగా ఉన్న కడప జిల్లాలో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కడప కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఇపీసీ) సమావేశం జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జేసీ డా. నిధి మీనా
మాట్లాడుతూ… జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి.. పరిశ్రమల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
- సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా మొత్తం 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు అందగా, వాటిలో ఇప్పటి వరకు 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందని, 10,836 దరఖాస్తులు పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయని, 88 దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పలు కారణాల వల్ల పెండింగ్ లో ఉంచడం జరిగిందన్నారు.
- * పారిశ్రామిక అభివృద్ధి పాలసీ ప్రకారం జిల్లాలో మొత్తం రూ. 3,53,98,514 ల మేర నిధుల విడుదలకు అనుమతినివ్వడం జరిగిందన్నారు. ఇందులో ఐడిపి 2023-27 పాలసీ ప్రకారం ఎస్సి కేటగిరి పలు యూనిట్లకు రూ. 1,17,12,829 లు. ఐడిపి 2024-29 పాలసీ ప్రకారం ఎస్సి కేటగిరి పలు యూనిట్లకు రూ. 2,35,99,841 ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఐడిపి 2020-23 పాలసీ ప్రకారం ఓబీసీ కేటగిరి క్రింద రూ. 85,844 లు, మేర నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. పరిశ్రమల ప్రమోషన్ కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటే.. వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు.
అంతకుముందు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం చాంద్ బాషా సంబందిత వివరాలను సమావేశంలో కలెక్టర్ కు వివరించగా.. ఆయా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు.
ఈ సమావేశంలో సిక్కి డిసి డి. జ్ఞాన ప్రకాష్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నారావు, ఎల్డిఎం జనార్దనం, సోషల్ వెల్ఫేర్, డిఆర్డీఏ, మెప్మా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక డిడిఆర్ఎఫ్ అధికారులు, డిటిఓ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ, ఏపీఎస్ పిడీసీఎల్ శాఖల అధికారులు, ఏపీఐఐసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

