చిత్తూరు జిల్లా/బంగారుపాళ్యం, మహి న్యూస్, మార్చి 10 :
చిత్తూరు జిల్లా,బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని చూపించి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ యొక్క గొప్పతనాన్ని వివరించారు.

పోలీసులు యొక్క విధివిధానాలను చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు.పోలీసులంటే అహర్నిశలు ప్రజల కోసం ధన,మాన,ప్రాణాలను కాపాడే వ్యక్తులని వివరించారు. పోలీసులంటే ఒకరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ ప్రసాద్,విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ ఆర్.ఎన్. జ్యోతినాథ్,ఇంచార్జ్ హిమగిరి, డైరెక్టర్ రవితేజ, ఉపాధ్యాయులు బేబీరాణి, ఉష,లిఖిత తదితరులు పాల్గొన్నారు.

