కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10:
కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ గోరంట్ల లక్ష్మి మాధవస్వామి తిరుణాల మహోత్సవం వేడుకల్లో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.భక్తులందరికీ ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ గోరంట్ల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి మాధవస్వామి రథమును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ముఖ్యంగా మంగళవారం సాయంకాలం జరిగే శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి మాధవ స్వామి రథోత్సవ కార్యక్రమం ఎలాంటి అవాంచచనీయ ఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆలయ కమిటీ వారికీ, ఉత్సవ కమిటీకి,పోలీస్ సిబ్బందికి,అధికారులకు ఆదేశాలివ్వడమైనది.

గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

