కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10:
కర్నూలులోని పసుపుల గ్రామ పరిధిలో గల జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో భారత ప్రభుత్వ మైనారిటీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం వికాస్ పథకం కింద మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైనారిటీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ తో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నైపుణ్య శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకుని స్వయం ఉపాధి అవకాశాలు పొందగలరని తెలిపారు.యువత తమ ప్రతిభను పెంపొందించుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జి పుల్లయ్య , కళాశాల ప్రతినిధులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

