కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి10:
కర్నూలు మార్కెట్ యార్డ్ నందు నెలకొల్పిన చలివేంద్రములను అధ్యక్షులు గోల్కొండ అజ్మత్ బి, ఉపాధ్యక్షులు శేషగిరిశెట్టి మరియు సెలెక్షన్ గ్రేడ్ సెక్రెటరీ జయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వాము, వేరుశనగలు, కందులు, మినుములు లాంటి పంట ఉత్పత్తులు చాలా ఎక్కువగా వస్తున్నాయని ఆ పంటలు తెచ్చే రైతులు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా మినరల్ వాటర్ తో నాలుగు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని శుభ్రమైన మినరల్ వాటర్ ను వినియోగించుకోవాలని రైతులను కార్మికులను వ్యాపారులను కోరారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎ.మారుతి శర్మ, కాశపోగు సువార్తమ్మ, జయశ్రీ యాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

