రైల్వేకోడూరు/పుల్లంపేట. మహిన్యూస్. మార్చి:10
రైల్వేకోడూరు నియోజకవర్గంపుల్లంపేటల్
లో విభిన్న ప్రతిభావంతులకు ఈనెల 14వ తేదీ శనివారం రైల్వేకోడూరు,చిట్వేలి పాఠశాలల యందు సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ వారి సౌజన్యముతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో ద్వారా విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా సహాయ సంచాలకుల వారు నిర్వహించబోయే కృత్రిమ సహాయ పరికరాల కార్యక్రమం నిర్వహించబడుతోందని పుల్లంపేట మండల అభివృద్ధి అధికారి జై శ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుల్లంపేట, ఓబుళవారిపల్లి, రైల్వేకోడూరు మండలాలకు చెందిన వారికి రైల్వేకోడూరుకు చెందినహేన్రీ మేయర్ మెమోరియల్ స్కూల్ (హె. ఎం. ఎం. హై స్కూల్ ఎంపీడీవో కార్యాలయం దగ్గర, పెనగలూరు చిట్వేల మండలాల కు చెందిన వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ నందు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులు మీకు కేటాయించిన ప్రాంతాలలో వెళ్లి మీకు అవసరమైన కృత్రిమ సహాయ పరికరాలను దరఖాస్తు చేసుకోగలరని ఆమె కోరారు. ఈ శిబిరంలో చేతి కర్రలు,వాకర్లు, మూడు, నాలుగు కాళ్ల చేతి కర్రలు, చoఖకరలు ,వీల్ చైర్లు చెవి వెనుక ధరించే వినికిడి యంత్రాలు, బ్యాటరీట్రై సైకిల్, మూడు చక్రాల సైకిల్,లు రో లెటర్స్, ఎంఎస్ కిట్స్,అందులచేతి వాచ్, అందుల చేతి కర్రలు వాయిస్ ఫోను ఎల్ బో క్రచేస్ , కుష్టువ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులకు కిట్లు, డైసీ ప్లేయర్స్, ఎం ఎస్ ఐ డి కిడ్స్, స్మార్ట్ కేను కృత్రిమ అవయవముల మొదలగు వివిధ రకములైన ఉపకరణములు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.. ఇవి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు దారిద్రరేఖకు పరిమితికి లోబడి ఆదాయం కలవారు, వారి భౌతిక అవసరా ల కు
91 95058 70787: అవసరాలను బట్టి సహాయ ఉపకరణములో వినియోగం తప్పనిసరైన వారు అర్హతను బట్టి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఉపకరణములు అవసరం గలవారు అని ఆమె వివరించారు. దివ్యాంగులు శిబిరమునకు తీసుకురావలసిన పత్రాలు యూ డి ఐ డి కార్డు రసీదు, ఆధార్ కార్డు, సదరం వైద్య ధ్రువీకరణ పత్రము,రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రము,రెండు
ఫోటోలు మొబైల్ నెంబరు అన్ని ధ్రువపత్రాలను క్యాంపుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రెండు సెట్ల జిరాక్స్లు తీసుకురావాలని ఆమె తెలియజేశారు. వయో వృద్ధులు అయితే వారు తీసుకురావలసిన పత్రాలు ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రము,నాలుగు ఫోటోలు, మొబైల్ నెంబరు తో రెండు సెట్ల జిరాక్స్లు తీసుకురావాలని తెలిపారు. దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ఏ పరికరం అవసరమో గుర్తించి ఎంపిక చేయడం ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశంఅని ఆమె తెలియజేశారు. ఈ శిబిరములో అప్పటికప్పుడు సహాయ పరికరాలు ఇవ్వబడవని గుర్తింపబడిన లబ్ధిదారులకు పంపిణీ తేదీ ప్రదేశం తదుపరి తెలియజేయడం జరుగుతుందన్నారు.ఈ శిబిరమునకు దివ్యాంగుల పింఛన్లు మంజూరుకు సంబంధం లేదన్నారు. అవసరము మరియు అర్హత కలిగిన పుల్లంపేట మండలంలోని దివ్యాంగులు వయోవృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. గత మూడు సంవత్సరములలో అలింకో ద్వారా సహాయ పరికరాలు పొందిన దివ్యాంగులు అనర్హులుగా పరిగణించబడునని, శారీరక దివ్యాంగులు 80% లేదా అంతకన్నా ఎక్కువ వికలాత్వ శాతం కలిగిన వారు మాత్రమే బ్యాటరీ సైకిల్ కు అర్హులని,ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోవాలన్న ఎడల మీయొక్క గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

