- జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ డా.నిధి మీనా
వైయస్సార్ కడప, మహి న్యూస్, మార్చి 10 :
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశము యొక్క ప్రత్యేకత అని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు… జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ డా.నిధి మీనా అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ లో శాంతి కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాజంపేట సబ్ కలెక్టర్ భావన,జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, బద్వేలు, పులివెందుల ఆర్ డి ఓ లు చంద్రమోహన్,చిన్నయ్య, కడప మున్సిపల్ కమీషనర్ రాకేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ… మత సంప్రదాయాలను గౌరవిస్తూ.. శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో.. భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా.. జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని తెలిపారు. శాంతియుత,ఆనంద వాతావరణంలో, ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకుకోవాలని.. శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. అందు కోసం… అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పండుగ ఏర్పాట్లు, ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. మత సామరస్యానికి ప్రతీకగా.. అన్ని మతాల ప్రజల సహకారంతో.. మజీద్ లు, ఈద్గాలు,దేవాలయాల వద్ద ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రార్థనలు, పూజలు జరిగేలా చూడాలన్నారు.పండుగ వేడుకల సమయంలో ఆలయాలు,మజీద్ ల అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు.ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే.. వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచార మివ్వలన్నారు.అనవసరమైన విషయాలనుఅత్యుత్సాహంతో.. సోషల్ మీడియాలలో పోస్తూ చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా వుండాలన్నారు. పోలీస్ శాఖ ఇచ్చే సూచనలను తప్పక పాటించాలన్నారు.

రంజాన్,ఉగాది, శ్రీరామ నవమి పండుగ వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి భావంతో జరుపుకునేందుకు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, శాంతిభద్రతలకు,మత సామరస్యానికి ఇబ్బంది కలగకుండాప్రార్థనలు,పూజలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను శాంతి కమిటీ సభ్యులు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పండుగ దినాల్లో నిరంతర నీటి సరఫరా,విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్లపై.. పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జేసీ స్వీకరించారు.
అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ…. ఉగాది పండుగ తో పాటు రంజాన్ శ్రీరామనవమి పండుగలు వరుస క్రమంలో ఉన్నందున ప్రజలందరూ మత సామరస్యాన్ని పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని అన్నారు.జిల్లాలో మసీదులు దర్గాల వద్ద శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో మైనారిటీ శాఖ జిల్లా అధికారి హిదియతుల్లా,శాంతి కమిటీ సభ్యులు, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, దేవాదాయ శాఖ,మైనారిటీ అధికారులు,పలువురు అలయ అర్చకులు,మౌజమ్ లు తదితరులు పాల్గొన్నారు.

