కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10:
కర్నూలు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిలు షాబీర్ భాష, శ్రీనివాసులు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు స్థానిక సిఆర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో షాబీర్ భాష, శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు ఒక కాలేజీకి అనుమతి తీసుకొని రెండు మూడు కాలేజీలు నిర్వహిస్తున్నారని దీనిపైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో ఇదే అదునుగా మేనేజ్మెంట్ పెట్టరేగిపోతుందని ఇలాంటి వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో అదే అదునుగా తీసుకొని మేనేజ్మెంట్, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అలాట్మెంట్ కార్డు తీసుకొని కళాశాలకు వెళ్తే ఫీజు మొత్తం చెల్లిస్తేనే సీటు కేటాయిస్తామని మేనేజ్మెంట్ చెప్తా ఉందని దీనివల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని బాధలు ఓర్చుకొని కళాశాలలో జాయిన్ అయినా స్టూడెంట్స్ నుండి క్లినికల్ ఫీజులు , అప్రెంటిస్ ఫీజులు అంటూ, డ్రెస్ ఫీజు, వ్యాన్ ఫీజు, ల్యాబ్ ఫీజు ఇలా ముక్క పిండి వసూలు చేయడమే కాకుండా విద్యార్థులు ఏదైనా కారణం చేత ఒక్కరోజు కళాశాలకు రాకపోయినా 100, 150 ఫైన్ వేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఈ సమస్యల పైన ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే ఇంటర్నల్ మార్క్స్ లో తగ్గిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు.మరి కొన్ని కళాశాలలో అనుమతులు తీసుకున్న బిల్డింగ్లలో కాకుండా ఎలాంటి మౌలిక వసతులు లేని, అర్హత కలిగిన సిబ్బందిని నియమించుకోకుండానే అర్హత లేని వ్యక్తులతో తరగతులు బోధిస్తూ విద్యార్థులకు న్యాయమైన విద్య అందించకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కావున ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన అధికారులు వీటి పైన విచారణ జరిపించి ప్రభుత్వ నిబంధనలను పాటించని, అర్హత కలిగిన ఫ్యాకల్టీ లేని,కళాశాలలను సీజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కళాశాల ముందు ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బి నాగరాజు,ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేశు, నగర అధ్యక్ష కార్యదర్శులు అభి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

