కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ మార్చి 10:
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏపీ మహిళా సమాఖ్య నగర సమితి ల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ ముందు పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా చేపట్టడం జరిగిందన్నారు.ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులుగా మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సమైక్య నగర కార్యదర్శి భారతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలు వాడుతున్న 14 కేజీల సిలిండర్ పైన 60 రూపాయలు హోటల్స్ వ్యాపారస్తులు వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన 160 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గమని తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని లేదా పెరిగిన గ్యాస్ ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వారి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఉదయం లేచినప్పటి నుండి నా హిందువులు నా బంధువులు అనే నరేంద్ర మోడీ మధ్యతరగతి హిందువులు వాడే 14 కేజీల సిలిండర్ పై 60 రూపాయలు పెంచి హిందువుల నడ్డి విరిచాడు.ఇండియాకు అతి తక్కువ ధరకే రష్యా నుండి ఆయిల్ దిగుమతి అవుతుంటే ఆయిలను రద్దు చేయించిన అమెరికా అధ్యక్షుడు అమెరికా వాడు చెప్పిన చోట ఆయిల్ కొనుగోలు చేయాలన్నారు.

గ్యాస్ కొనుగోలు చేయాలి అనే విధంగా వ్యవహరిస్తుంటే నరేంద్ర మోడీ నోరు మెదపలేదు మన సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.తక్షణమే పెంచిన గ్యాస్ రేట్లను ఉపసంహరించుకోవాలని అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే పెంచిన ధరలను భరించాలని దేశంలో గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తున్న గ్యాస్ డీలర్ల ఏజెన్సీల పైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి
డి శ్రీనివాసరావు, నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు, అన్వర్, ఈశ్వర్, రామచంద్ర, అశోక్ సి,కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ భాష, మహిళా సంఘం నాయకులు ధనలక్ష్మి, రబియా, మాధవి,
శాఖా కార్యదర్శులు రామంజి, కరీమున్ని ,ప్రకాష్ నగర్ ఆశ, జయమ్మ, జ్యోతి, స్వప్న మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

